Drohi : ద్రోహి ఎవరు?
ABN , First Publish Date - 2023-09-09T04:26:12+05:30 IST
సందీప్ కుమార్ బొడ్డపాటి, దీప్తి వర్మ జంటగా నటించిన చిత్రం ‘ద్రోహి’. ‘ది క్రిమినల్’ అనేది ఉపశీర్షిక. విజయ్ పెందుర్తి దర్శకత్వం

సందీప్ కుమార్ బొడ్డపాటి, దీప్తి వర్మ జంటగా నటించిన చిత్రం ‘ద్రోహి’. ‘ది క్రిమినల్’ అనేది ఉపశీర్షిక. విజయ్ పెందుర్తి దర్శకత్వం వహిస్తూ, శ్రీకాంత్ రెడ్డి, రాజశేఖర్‌తో కలసి నిర్మిస్తున్నారు. ఈ నెలలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. శుక్రవారం దర్శకుడు క్రిష్ చేతుల మీదుగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఉత్కంఠకు గురిచేసే కథాంశంతో రూపొందుతున్న చిత్రమిదని దర్శకుడు తెలిపారు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి కావొచ్చాయి, ఈ నెలలోనే సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: అనంత్ నారాయణ్. సినిమాటోగ్రఫీ: అశోక్ దబేరు