సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఎవరికి స్నేహితుడు?

ABN, First Publish Date - 2023-01-02T03:32:21+05:30

మనిషిని పోలిన మనుషులు ఈ లోకంలో ఏడుగురు ఉంటారని చెబుతుంటారు. అది నిజమో కాదో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనిషిని పోలిన మనుషులు ఈ లోకంలో ఏడుగురు ఉంటారని చెబుతుంటారు. అది నిజమో కాదో.. తెలీదుగానీ, ఇలాంటి కాన్సెప్టుతోనే ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. అదే.. ‘అమిగోస్‌’. కల్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. రాజేంద్రరెడ్డి దర్శకుడు. మైత్రీ మూవీస్‌ నిర్మిస్తోంది. ఫిబ్రవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. జనవరి 1 సందర్భంగా ఆదివారం ఈ సినిమా నుంచి కల్యాణ్‌ రామ్‌ కొత్త లుక్‌ని విడుదల చేశారు. ఈ సినిమాలో ఆయన సిద్దార్థ్‌ అనే పాత్రలో కనిపిస్తారు. ఆషికా రంగనాథ్‌ కథానాయికగా నటిస్తోంది. ‘అమిగోస్‌’ అంటే స్పానిష్‌లో స్నేహితుడని అర్థం. మరి.. ఈ సినిమాలో కల్యాణ్‌ రామ్‌ ఎవరికి స్నేహితుడో, ఈ మనిషిని పోలిన మరో మనిషి కథేమిటో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాలి. సంగీతం: జిబ్రాన్‌.

Updated Date - 2023-01-02T03:32:30+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!