Who : అక్టోబర్‌లో హూ

ABN , First Publish Date - 2023-09-09T04:20:18+05:30 IST

జెడి చక్రవర్తి, శుభరక్ష, నిత్య హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘హూ’. జెడి చక్రవర్తి దర్శకత్వం వహించారు. నిర్మాణానంతర కార్యక్రమాలు

 Who : అక్టోబర్‌లో హూ

జెడి చక్రవర్తి, శుభరక్ష, నిత్య హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘హూ’. జెడి చక్రవర్తి దర్శకత్వం వహించారు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రెడ్డమ్మ కె. బాలాజీ మాట్లాడుతూ ‘తెలుగు, కన్నడ భాషల్లో రూపుదిద్దుకున్న థ్రిల్లర్‌ చిత్రం ‘హూ’. యాక్షన్‌ సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచే స్థాయిలో చిత్రీకరించాం. క్లాస్‌ మాస్‌ ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. సినిమాను అక్టోబర్‌లో విడుదల చేస్తాం’ అని చెప్పారు. వినయ్‌ ప్రసాద్‌, విజయ్‌ చందర్‌, సునీల్‌ పూర్ణిక్‌ కీలకపాత్రలు పోషించారు. సంగీతం: ఈశ్వర్‌ చంద్‌, సినిమాటోగ్రఫీ: ఎంబి. అల్లికట్టి

Updated Date - 2023-09-09T04:20:18+05:30 IST