మనల్ని ఎవడ్రా ఆపేది?
ABN , First Publish Date - 2023-05-25T01:59:12+05:30 IST
నాగశౌర్య కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రంగబలి’. పవన్ బాసంశెట్టి దర్శకుడు. చెరుకూరి సుధాకర్ నిర్మాత. యుక్తి తరేజ

నాగశౌర్య కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రంగబలి’. పవన్ బాసంశెట్టి దర్శకుడు. చెరుకూరి సుధాకర్ నిర్మాత. యుక్తి తరేజ కథానాయికగా పరిచయం అవుతోంది. ఈ చిత్రం నుంచి ‘మన ఊర్లో ఎవడ్రా ఆపేది’ పాటని విడుదల చేశారు. పవన్ సి.హెచ్ సంగీతాన్ని అందించారు. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. పవన్, శ్రీహర్ష రాశారు. జానీ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు. ‘‘మాస్ అండ్ పెప్పీ డాన్స్ నంబర్ ఇది. నాగశౌర్య వేసే స్టెప్పులు కొత్తగా ఉంటాయి. ఊరి కుర్రాళ్లు సరదాగా పాడుకొనే పాటలా ఉంటుంది. మిగిలిన పాటలూ తప్పకుండా ఆకట్టుకొంటాయి. యాక్షన్ నేపథ్యంలో సాగే కథ ఇది. శౌర్యకు కొత్త ఇమేజ్ తీసుకొస్తుంద’’ని దర్శక నిర్మాతలు తెలిపారు.