సమంత ఎక్కడ?
ABN , First Publish Date - 2023-09-05T02:16:45+05:30 IST
ఆరు సీజన్లు పూర్తి చేసుకుని తాజాగా ఏడో సీజన్‌లోకి ‘బిగ్‌బాస్’ అడుగుపెట్టింది. ఆదివారం ప్రారంభమైన గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న ‘ఖుషి’ చిత్రకథానాయకుడు విజయ్ దేవరకొండ, హోస్ట్ నాగార్జున మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది...

విజయ్‌ని అడిగిన నాగార్జున
ఆరు సీజన్లు పూర్తి చేసుకుని తాజాగా ఏడో సీజన్‌లోకి ‘బిగ్‌బాస్’ అడుగుపెట్టింది. ఆదివారం ప్రారంభమైన గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న ‘ఖుషి’ చిత్రకథానాయకుడు విజయ్ దేవరకొండ, హోస్ట్ నాగార్జున మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా ‘నీ హీరోయిన్ సమంత ఎక్కడ?’ అని విజయ్‌ని అడిగారు నాగార్జున. ‘అమెరికాలో ఉంది. యూఎస్ ప్రమోషన్స్‌తో పాటు తన హెల్త్‌కు సంబంధించిన ట్రీట్‌మెంట్‌కు వెళ్లింది. త్వరలోనే ఇక్కడకు వస్తుంది. ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది’ అని జవాబు ఇచ్చారు విజయ్. ‘నువ్వు మంచి నటుడివి.. సామ్ కూడా బాగా నటిస్తుంది. ఈ సినిమాలో ఎవరిని ఎవరు డామినేట్ చేశారు?’ అని నాగార్జున ప్రశ్నిస్తే ‘నేను ఆధిపత్యం చూపిద్దామని ప్రయత్నించా. కానీ భార్యలే కదా డామినేట్ చేసేది’ అని విజయ్ చెప్పగానే నాగార్జున నవ్వేశారు