కథ వినగానే ఆ సినిమా చేయాలనుకున్నాను

ABN , First Publish Date - 2023-02-14T03:08:36+05:30 IST

‘సితార బేనర్‌ లో ‘భీమ్లానాయక్‌’ షూటింగ్‌ చేస్తున్నప్పుడే ‘సార్‌’ చిత్రంలో అవకాశం వచ్చింది. నా నటన చూసి నిర్మాతలు ధను్‌షతో నటించే అవకాశం ఇచ్చారు...

కథ వినగానే ఆ సినిమా చేయాలనుకున్నాను

‘సితార బేనర్‌ లో ‘భీమ్లానాయక్‌’ షూటింగ్‌ చేస్తున్నప్పుడే ‘సార్‌’ చిత్రంలో అవకాశం వచ్చింది. నా నటన చూసి నిర్మాతలు ధను్‌షతో నటించే అవకాశం ఇచ్చారు. వెంకీ చెప్పిన కథ వినగానే ఇది కచ్చితంగా చేయాల్సిన సినిమా అనిపించింది’ అని సంయుక్త అన్నారు. ఆమె ధను్‌షకు జోడీగా నటించిన చిత్రమిది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. ఈ నెల 17న ‘సార్‌’ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా సంయుక్త మీడియాతో ముచ్చటించారు.

  • ‘సార్‌’ చిత్రంలో మీనాక్షి అనే బయాలజీ టీచర్‌ పాత్ర చేశాను. కీలకమైన పాత్ర. సినిమా ఆధ్యంతం హీరోతో ప్రయాణించే పాత్ర. నా పాత్ర కోసం ముందస్తుగా సన్నద్ధమయ్యాను. కొన్ని గ్రామాలకు వెళ్లి అక్కడ అమ్మాయిలు ఎలా ఉన్నారు, వారి మాట తీరు, వస్త్రధారణ పరిశీలించాను.

  • ధనుష్‌ సినిమాలు చూస్తూ పెరిగాను. అభిమాన హీరోతో సినిమా చేయడం చాలా ఆనందం కలిగించింది. ఈ చిత్రంలో విద్యావ్యవస్థ గురించి సందేశం ఇవ్వడంతో పాటు మంచి వినోదం కూడా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అంశాలు ఉన్నాయి. తెలుగు సినిమాలు చేయడం వల్ల నటిగా పేరు, మంచి అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ‘విరూపాక్ష’, ‘బింబిసార 2’ చిత్రాల్లో నటిస్తున్నాను.

Updated Date - 2023-02-14T03:08:38+05:30 IST