‘కేబుల్ రెడ్డి’ కథేమిటి?
ABN, First Publish Date - 2023-08-19T01:39:44+05:30
సుహాస్ కథానాయకుడిగా శ్రీధర్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘కేబుల్ రెడ్డి’. షాలిని కొండేపూడి కథానాయిక.....
సుహాస్ కథానాయకుడిగా శ్రీధర్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘కేబుల్ రెడ్డి’. షాలిని కొండేపూడి కథానాయిక. బాలు వల్లు, ఫణి ఆచార్య నిర్మాతలు. శుక్రవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి శైలేష్ కొలను క్లాప్‌నిచ్చారు. శ్రీధర్ రెడ్డి స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా సుహాస్ మాట్లాడుతూ ‘‘శ్రీధర్ నాకు మంచి స్నేహితుడు. తనకిదే తొలి చిత్రం. మరో రెండు రోజుల్లో షూటింగ్ ప్రారంభం అవుతుంద’’న్నారు. ‘‘ఓ పట్నంలో జరిగే కథ ఇది. చాలా ఆసక్తికరంగా ఉంటుంద’’ని దర్శకుడు చెప్పారు. ‘‘మంచి టీమ్‌తో పని చేస్తున్నందుకు ఆనందంగా ఉంద’’న్నారు షాలిని. సంగీతం: స్మరన్ సాయి.