అంతిమ తీర్పు ఏమిటి?
ABN , First Publish Date - 2023-08-31T02:32:48+05:30 IST
సాయిధన్సిక, విమలారామన్, గణేశ్ వెంకట్రామన్ ముఖ్య పాత్రలు పోషించిన ‘అంతిమతీర్పు’ చిత్రం త్వరలో విడుదల కానుంది...

సాయిధన్సిక, విమలారామన్, గణేశ్ వెంకట్రామన్ ముఖ్య పాత్రలు పోషించిన ‘అంతిమతీర్పు’ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఎ.అభిరామ్ దర్శకత్వంలో డి.రాజేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘వినూత్న కథాంశంతో రూపొందిన చిత్రం ఇది. ప్రేక్షకులు కోరకునే అంశాలు అన్నీ ఉన్నాయి. సాయిధన్సిక నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటులు దీపు, బండి రమేశ్ తదితరులు కూడా పాల్గొన్నారు.