ఆ రహస్యం ఏమిటి?
ABN , First Publish Date - 2023-05-16T02:17:55+05:30 IST
నిఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘స్పై’. ఆర్యన్ రాజేశ్ కీలక పాత్రధారి. ఐశ్వర్య మీనన్ కథానాయిక. గ్యారీ దర్శకత్వం వహిస్తున్నారు...

నిఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘స్పై’. ఆర్యన్ రాజేశ్ కీలక పాత్రధారి. ఐశ్వర్య మీనన్ కథానాయిక. గ్యారీ దర్శకత్వం వహిస్తున్నారు. కె.రాజశేఖర్ రెడ్డి నిర్మాత. ఆయనే కథ అందించారు. సోమవారం ఢిల్లీలో టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ ‘‘నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం ఇప్పటికీ మిస్టరీనే. ఆ రహస్యాన్ని ఛేదించే సినిమా ఇది. నేతాజీ గురించి ఇప్పటి వరకూ ఎవరికీ తెలియని విషయాలు ఈ సినిమాలో చూపిస్తున్నాం. అంతకు మించిన షాకింగ్ విషయాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. కోర్ పాయింట్ చెబితే ఆశ్చర్యపోతార’’న్నారు. ‘‘విజువల్ గ్రాండియర్‌కి ఈ చిత్రం ఓ ఉదాహరణగా నిలుస్తుంది. జూన్ 29న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నామ’’ని నిర్మాత తెలిపారు.