కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రేక్షకులని అలరించేలా ఏం చేస్తున్నావ్‌

ABN, First Publish Date - 2023-08-13T00:42:55+05:30

విజయ రాజ్‌ కుమార్‌, నేహా పఠానీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఏం చేస్తున్నావ్‌’. భరత్‌ మిత్ర దర్శకత్వంలో నవీన్‌ కురవ, కిరణ్‌ కురవ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ రిలీజ్‌...

విజయ రాజ్‌ కుమార్‌, నేహా పఠానీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఏం చేస్తున్నావ్‌’. భరత్‌ మిత్ర దర్శకత్వంలో నవీన్‌ కురవ, కిరణ్‌ కురవ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ రిలీజ్‌ కార్యక్రమం నిర్వహించారు. హీరో శ్రీవిష్ణు చేతుల మీదుగాటీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఏం చేస్తున్నావ్‌’ అనేది చాలా మంచి టైటిల్‌. దీనికి చాలా అర్థాలు ఉన్నాయి. భరత్‌కు మంచి విజన్‌ ఉంది. సినిమా ఘన విజయం సాధించాలి’ అని కోరుకున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘18-30 ఏళ్ల మధ్య వయస్కులకు ఈ సినిమా బాగా కనెక్ట్‌ అవుతుంది. మంచి సినిమా చూసిన అనుభూతితో ప్రేక్షకులు థియేటర్‌ బయటకు వెళతారు’ అన్నారు. ద్వితీయార్థం ప్రేక్షకులను బాగా అలరిస్తుందని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి గోపీసుందర్‌ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే ఆదరణ పొందాయని హీరో తెలిపారు.

Updated Date - 2023-08-13T00:42:55+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!