కోడి పులావ్‌ కథేంటి?

ABN , First Publish Date - 2023-07-24T05:05:48+05:30 IST

శివ కోన స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘రాజుగారి కోడిపులావ్‌’. ‘కుటుంబ కథ విచిత్రం’ అనేది ట్యాగ్‌లైన్‌. అభిలాష్‌, ప్రాచీఠాకూర్‌ జంటగా నటించారు...

కోడి పులావ్‌ కథేంటి?

శివ కోన స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘రాజుగారి కోడిపులావ్‌’. ‘కుటుంబ కథ విచిత్రం’ అనేది ట్యాగ్‌లైన్‌. అభిలాష్‌, ప్రాచీఠాకూర్‌ జంటగా నటించారు. ఈటీవీ ప్రభాకర్‌, నేహాదేశ్‌పాండే, కునాల్‌ కౌశల్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 4న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శివ కోన మాట్లాడుతూ ‘చిన్న సినిమా అయినా కంటెంట్‌ అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు. సినిమా కోసం యూనిట్‌ అంతా చాలా కష్టపడింది’ అన్నారు. రుచికరమైన రాజుగారి కోడిపులావును ప్రేక్షకులూ రుచి చూడాలని ప్రాచీ ఠాకూర్‌ కోరారు. ఒక వినూత్నమైన కథతో ఈ చిత్రం తెరకెక్కిందని కునాల్‌ కౌశల్‌ తెలిపారు.

Updated Date - 2023-07-24T05:05:48+05:30 IST