Chandramukhi 2 : చంద్రముఖికి స్వాగతం
ABN , First Publish Date - 2023-08-13T00:45:32+05:30 IST
లారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘చంద్రముఖి 2’. పి.వాసు దర్శకుడు. సుభాస్కరన్ నిర్మాత. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు...

లారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘చంద్రముఖి 2’. పి.వాసు దర్శకుడు. సుభాస్కరన్ నిర్మాత. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈలోగా ప్రమోషన్ కార్యక్రమాల్ని ముమ్మరం చేశారు. ‘చంద్రముఖి 2’ నుంచి ‘స్వాగతాంజలి’ అనే పాటని చిత్రబృందం విడుదల చేసింది. కీరవాణి స్వరాలు అందించారు. శ్రీనిధి తిరుమల పాడారు. చైతన్య ప్రసాద్ సాహిత్యాన్ని అందించారు. రాజనర్తకిగా కంగనాని ఈ పాటలో పరిచయం చేశారు. ఈ పాటలో సెట్స్, కాస్ట్యూమ్స్ ఆకట్టుకొంటున్నాయి. వడివేలు, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్ కీలక పాత్రలు పోషించారు.