కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కాంతార ప్రపంచానికి పునఃస్వాగతం

ABN, First Publish Date - 2023-11-28T06:16:40+05:30

‘కాంతార’... కన్నడ చిత్రసీమని గర్వంగా తలెత్తుకొనేలా చేసింది. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రంప్రభంజనం సృష్టించింది...

‘కాంతార’... కన్నడ చిత్రసీమని గర్వంగా తలెత్తుకొనేలా చేసింది. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రంప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘కాంతార చాప్టర్‌ 1’ శ్రీకారం చుట్టుకొంది. సోమవారం ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు. ఓ చిన్న పాటి టీజర్‌ కూడా వచ్చింది. ఈ టీజర్‌లో ‘కాంతార’ ప్రపంచంలోకి మరోసారి ప్రేక్షకుల్ని తీసుకెళ్లిపోయాడు దర్శక కథానాయకుడు రిషబ్‌ శెట్టి. ‘కాంతార’ లుక్‌లో రిషబ్‌ శెట్టిని చూస్తే మరోసారి ఒళ్లు జలదరించడం ఖాయం. హొంబలే ఫిల్మ్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో, అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తోంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలేం చిత్రబృందం ప్రకటించలేదు. ‘కాంతార చాప్టర్‌ 1’లో ఏం చూపించబోతున్నారు? కథేమిటి? అనే విషయాలూ గోప్యంగానే ఉంచారు.

Updated Date - 2023-11-28T06:16:42+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!