పెళ్లి తర్వాత ప్రేమ తగ్గుతుందా?

ABN , First Publish Date - 2023-06-03T00:09:06+05:30 IST

వినోదంతో ప్రేమకథను మిళితం చేసి రూపొందిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘వెడ్డింగ్‌ డైరీస్‌’ . ఇందులో అర్జున్‌ అంబటి, చాందిని తమిళరసన్‌ జంటగా నటిస్తున్నారు.

పెళ్లి తర్వాత ప్రేమ తగ్గుతుందా?

వినోదంతో ప్రేమకథను మిళితం చేసి రూపొందిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘వెడ్డింగ్‌ డైరీస్‌’ . ఇందులో అర్జున్‌ అంబటి, చాందిని తమిళరసన్‌ జంటగా నటిస్తున్నారు. ‘రీసెట్‌ అండ్‌ రీస్టార్ట్‌’ అనే డిఫరెంట్‌ ట్యాగ్‌లైన్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. స్వీయ దర్శకత్వంలో వెంకటరమణ మిద్దే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయన ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ‘పెళ్లి తర్వాత ప్రేమ తగ్దిపోతుందా అనే కాన్సెప్ట్‌ ఆధారంగా ఈ సినిమా తీస్తున్నాం. భార్యా భర్తలైన ప్రశాంత్‌, శ్రుతి మధ్య లవ్‌, రిలేషన్‌ షిప్‌ లో అప్‌ అండ్‌ డౌన్స్‌ , చివరకు గొడవలతో వారు విడిపోవాలని నిర్ణయించుకోవడం వంటి ట్విస్టులతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. విడిపోవాలనుకున్న ఈ జంట తిరిగి తమ ప్రేమను బలపర్చుకుని వైవాహిక బంధాన్ని ఎలా కొనసాగించింది, ఆ భార్యాభర్తల సంఘర్షణకు కారణాలు ఏమిటి? అనేది ఈ సినిమాలో మెయిన్‌ పాయింట్‌’ అని చెప్పారు. చమ్మక్‌ చంద్ర, జయలలిత, మేకా రామకృష్ణ, రవితేజ పైలా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మదీన్‌ ఎస్‌.కె, ఫొటోగ్రఫీ: ఈశ్వర్‌ వై, సమర్పణ: డాక్టర్‌ మిద్దే విజయవాణి.

Updated Date - 2023-06-03T00:09:06+05:30 IST