సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

స్పెయిన్‌లో పెళ్లి రోజు

ABN, First Publish Date - 2023-02-10T00:22:42+05:30

ఇటు సినిమాలు.. అటు కుటుంబం... ఇలా రెంటికీ తగిన సమయం కేటాయిస్తుంటారు మహేశ్‌బాబు. షూటింగుల మధ్య కాస్త బ్రేక్‌ వచ్చినా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇటు సినిమాలు.. అటు కుటుంబం... ఇలా రెంటికీ తగిన సమయం కేటాయిస్తుంటారు మహేశ్‌బాబు. షూటింగుల మధ్య కాస్త బ్రేక్‌ వచ్చినా, కుటుంబంతో సహా విహార యాత్రలకు వెళ్లిపోతుంటారు. పుట్టిన రోజులాంటి ప్రత్యేకమైన సందర్భాల్లో సర్‌ప్రైజ్‌ టూర్లు ప్లాన్‌ చేస్తుంటారు. ఫిబ్రవరి 10.. మహేశ్‌ పెళ్లి రోజు. ఈ సందర్భంగా స్పెయిన్‌ విమానం ఎక్కేశారు. నమ్రత, సితార, గౌతమ్‌లతో కలిసి గురువారం స్పెయిన్‌ వెళ్లారు. అక్కడ నాలుగైదు రోజులు గడిపి, తిరిగొస్తారు. ప్రస్తుతం త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతోంది. మహేశ్‌ ఫారెన్‌ ట్రిప్‌ వల్ల ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌కీ బ్రేక్‌ పడింది.

Updated Date - 2023-02-10T00:22:44+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!