Sathyaraj: ‘బాహుబలి’ కంటే కూడా ఈ సినిమాలో ఎక్కువ యాక్షన్ సీన్స్‌లో నటించా..

ABN , First Publish Date - 2023-09-05T21:51:47+05:30 IST

‘మిర్చి, బాహుబలి’ సహా ఎన్నో చిత్రాల్లో నటించిన కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సత్యరాజ్.. ‘అశ్విన్స్, జైలర్’ చిత్రాల్లో మెప్పించిన యాక్టర్ వసంత్ రవి ప్రధాన పాత్రధారులుగా నటిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘వెపన్’. ఈ సినిమా గ్లింప్స్‌ను మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు.

Sathyaraj: ‘బాహుబలి’ కంటే కూడా ఈ సినిమాలో ఎక్కువ యాక్షన్ సీన్స్‌లో నటించా..
Weapon Movie Press Meet

‘మిర్చి, బాహుబలి’ సహా ఎన్నో చిత్రాల్లో నటించిన కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సత్యరాజ్ (Sathyaraj).. ‘అశ్విన్స్, జైలర్’ చిత్రాల్లో మెప్పించిన యాక్టర్ వసంత్ రవి (Vasanth Ravi) ప్రధాన పాత్రధారులుగా నటిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘వెపన్’. మిలియన్ స్టూడియో బ్యానర్‌పై గుహన్ సెన్నియప్పన్ (Guhan Senniappan) దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా గ్లింప్స్‌ను మేకర్స్ మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో సత్యరాజ్, వసంత్ రవి, తాన్యా హోప్, రాజీవ్ మీనన్, నిర్మాత మన్సూర్, డైరెక్టర్ గుహన్ సెన్నియప్పన్ వంటి వారంతా పాల్గొన్నారు.


ఈ కార్యక్రమంలో సత్యరాజ్ మాట్లాడుతూ.. ‘వెపన్’ లాంటి ఓ సినిమాను తీయాలంటే నటీనటులకంటే కూడా డైరెక్టర్, ప్రొడ్యూసర్స్, సినిమాటోగ్రాఫర్, వి.ఎఫ్.ఎక్స్ టెక్నీషియన్సే కీలకం. వాళ్ల తర్వాతే యాక్టర్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలనేది నా అభిప్రాయం. ఈ సినిమాకు చాలా మంచి టీమ్ కుదిరింది. డిఫరెంట్ కాన్సెప్ మూవీ. నిర్మాతలైతే మరో ఆలోచన లేకుండా ఖర్చు పెట్టి సినిమాను అద్భుతంగా రూపొందిస్తున్నారు. డైరెక్టర్ గుహన్ సరికొత్త విజన్‌తో సినిమాను ఆవిష్కరించారు. వసంత్ రవి ఇప్పుడు పాన్ ఇండియా యాక్టర్ అయ్యాడు. తన నటన గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాన్యా హోప్, రాజీవ్ మీనన్, రాజీవ్ పిళ్లై ఇలా అందరూ చక్కగా వర్క్ చేశారు. నా వరకు వస్తే.. ‘బాహుబలి’ కంటే కూడా ఈ సినిమాలో ఎక్కువ యాక్షన్ సీన్స్‌లో నటించాను. ఫైట్ మాస్టర్ చక్కగా డిజైన్ చేయటంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ సన్నివేశాలను పూర్తి చేశాం. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని తెలిపారు. (Weapon Movie Glimpse Launch)

Sathyaraj.jpg

వసంత్ రవి మాట్లాడుతూ.. ‘వెపన్’ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాను. అందరూ చాలా ప్రేమతో మంచి ఎఫర్ట్ పెట్టి సినిమాను రూపొందిస్తున్నారు. కథ వినగానే మనం చూసిన సూపర్ హీరోస్ సినిమాల్లా అనిపించింది. గుహన్ దీన్ని ఎలా చేస్తాడా? అని అనుకున్నాను. అలాగే ఇందులో సత్యరాజ్ గారు సూపర్ హ్యూమన్‌లా కనిపిస్తారనగానే హ్యపీగా అనిపించింది. అదే సమయంలో ఆయనలాంటి యాక్టర్‌తో చేయటం అంటే చిన్న విషయం కాదు. నిజంగానే షూటింగ్ సమంయలో చాలా విషయాలను నేర్చుకున్నాను. ఇందులో ఏఐ టెక్నాలజీని ఉపయోగించారు. సరికొత్త సూపర్ హ్యూమన్ కాన్సెప్ట్‌తో సినిమా ఉంటుందని అన్నారు. చిత్ర దర్శకుడు గుహన్ సెన్నియప్పన్ మాట్లాడుతూ.. ‘వెపన్’ సినిమాను ఇంత గొప్పగా చేస్తున్నానంటే కారణం నిర్మాతలు. వారు మేకింగ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నేను అడిగినవన్నీ ఇవ్వటంతో సినిమాను చక్కగా పూర్తి చేస్తూ వస్తున్నాం. డీసీ, మార్వెల్ తరహా సూపర్ హ్యుమన్స్ కాన్సెప్ట్ తో వెపన్ సినిమాను తెరకెక్కిస్తున్నామని అన్నారు.

Updated Date - 2023-09-05T21:51:47+05:30 IST