సూపర్ హ్యూమన్ కాన్సెప్ట్‌తో వెపన్
ABN , First Publish Date - 2023-09-07T02:10:46+05:30 IST
తమిళ నటులు సత్యరాజ్, వసంత్ రవి ప్రధాన పాత్రలు పోషించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘వెపన్’. గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం గ్లింప్స్‌ను మంగళవారం మేకర్స్ హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో విడుదల చేశారు.

తమిళ నటులు సత్యరాజ్, వసంత్ రవి ప్రధాన పాత్రలు పోషించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘వెపన్’. గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం గ్లింప్స్‌ను మంగళవారం మేకర్స్ హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా సత్యరాజ్ మాట్లాడుతూ ‘ఈ సినిమాకు దర్శకనిర్మాతలతో పాటు కెమెరామన్, వి.ఎ్‌ఫ.ఎక్స్ టీమ్ చాలా కీలకం. ఆ తర్వాతే నటీనటుల గురించి చెప్పాలి. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. నిర్మాణపరంగా నిర్మాతలు రాజీ పడలేదు. ‘బాహుబలి’ కంటే ఈ సినిమాలో ఎక్కువ యాక్షన్ సీన్స్‌లో పాల్గొన్నాను. త్వరలో ‘వెపన్’ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు’ అన్నారు. దర్శకుడు గుహన్ సెన్నియప్పన్ మాట్లాడుతూ ‘డీసీ, మార్వెల్ చిత్రాల తరహాలో సూపర్ హ్యూమన్ కాన్సె్‌ప్టతో ‘వెపన్’ చిత్రాన్ని తెరకు ఎక్కిస్తున్నాం. అద్భుతమైన యాక్షన్ సీన్లు ఉన్నాయి. కేరళలోని వాగమన్‌లో షూటింగ్ చేశాం. తాన్యా హోప్ పాత్రలో చాలా కీలకమైన మలుపులు ఉంటాయి’ అని చెప్పారు. తమ బేనర్‌లో వస్తున్న తొలి సినిమా ఇదని నిర్మాత మన్సూర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పీవీఆర్ హెడ్ మీనా, తాన్యా హోప్, రాజీవ్ మీనన్, రాజీవ్ పిళ్ళై తదితరులు పాల్గొన్నారు.