సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

రోజుకు పదహారు గంటలు కష్టపడ్డాం

ABN, First Publish Date - 2023-05-03T02:02:58+05:30

‘ఇప్పటివరకూ మీకు కితకితలు పెట్టాను. కంటతడి పెట్టించాను. ఇప్పుడు ‘ఉగ్రం’ చిత్రంలో నా ఉగ్రరూపం చూడబోతున్నారు’ అని అల్లరి నరేశ్‌ అన్నారు. ఆయన హీరోగా విజయ్‌ కనకమేడల దర్శకత్వం వహించిన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఇప్పటివరకూ మీకు కితకితలు పెట్టాను. కంటతడి పెట్టించాను. ఇప్పుడు ‘ఉగ్రం’ చిత్రంలో నా ఉగ్రరూపం చూడబోతున్నారు’ అని అల్లరి నరేశ్‌ అన్నారు. ఆయన హీరోగా విజయ్‌ కనకమేడల దర్శకత్వం వహించిన చిత్రమిది. సాహూ గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించారు. మిర్నా మీనన్‌ కథానాయిక. ఈ నెల 5న విడుదలవుతోంది. ఇటీవలె ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లరి నరేశ్‌ మాట్లాడుతూ ‘‘నాంది’ చిత్రానికి పనిచేసిన టీం అంతా ‘ఉగ్రం’ చిత్రానికి పని చేశారు. ‘నాంది’కి మించి ఉండాలని అందరం కష్టపడ్డాం. ‘ఉగ్రం’ కోసం రోజూ 16 గంటలు చొప్పున 73 రోజులు పనిచేశాం. ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరించాలి’ అని కోరారు. విజయ్‌ కనకమేడల మాట్లాడుతూ ‘‘నాంది’తో నరేశ్‌గారు నన్ను నమ్మారు. ‘ఉగ్రం’లో యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం రేయింబవళ్లు కష్టపడ్డాం. సంగీతం, సినిమాటోగ్రఫీ... అన్నీ చక్కగా కుదిరాయి’ అని చెప్పారు. విజయ్‌ డిక్షనరీలో రాజీ అనే పదమే లేదు, మా నమ్మకాన్ని నిలబెట్టాడు అని హరీశ్‌ పెద్ది చెప్పారు. నరేశ్‌ కెరీర్‌లో ఇది అతిపెద్ద చిత్రం అవుతుందని సాహూ గారపాటి తెలిపారు. ఈ సినిమా నరేశ్‌ కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుందని మిర్నామీనన్‌ అన్నారు. హీరో నిఖిల్‌ మాట్లాడుతూ ‘‘ఉగ్రం’ ట్రైలర్‌ బాగుంది. సినిమా బ్లాక్‌బస్టర్‌ అవుతుంది’ అన్నారు. అడివి శేష్‌ మాట్లాడుతూ ‘నరేశ్‌ అంటే నాకు చాలా గౌరవం, ప్రేమ. ఉగ్రం తర్వాత అంతా ఆయన్ను యాంగ్రీ నరేశ్‌ అని పిలుస్తారు’ అని చెప్పారు. సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ ‘20 ఏళ్ల తర్వాత నరేశ్‌ అన్న ఒక మాస్‌ యాక్షన్‌ సినిమా చేస్తున్నారు. పెద్ద హిట్టవ్వాలి’ అని ఆకాంక్షించారు. ఉగ్రంతో ప్రేక్షకులు విజువల్‌ థ్రిల్‌ పొందబోతున్నారు అని దర్శకుడు హరీశ్‌ శంకర్‌ చెప్పారు. నరేశ్‌ మరిన్ని డిఫరెంట్‌ సినిమాలు చేయాలని అనిల్‌ రావిపూడి కోరారు.

Updated Date - 2023-05-03T02:02:58+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!