RIght : సక్సెస్‌ కొడతాం

ABN , Publish Date - Dec 30 , 2023 | 05:20 AM

కౌశల్‌ మంద, లీషా ఎక్లైర్స్‌ హీరో హీరోయిన్లుగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్‌ రథిల్లర్‌ ‘రైట్‌’. లుకలాపు మధు, మహంకాళి దివాకర్‌ నిర్మించారు. నేడు ఈ చిత్రం విడుదలవుతోంది.

RIght : సక్సెస్‌ కొడతాం

కౌశల్‌ మంద, లీషా ఎక్లైర్స్‌ హీరో హీరోయిన్లుగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్‌ రథిల్లర్‌ ‘రైట్‌’. లుకలాపు మధు, మహంకాళి దివాకర్‌ నిర్మించారు. నేడు ఈ చిత్రం విడుదలవుతోంది. ఇటీవలే చిత్రబృందం ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించింది. ముఖ్య అతిథిగా హాజరైన మంచు మనోజ్‌ మాట్లాడుతూ ‘ట్రైలర్‌ బాగుంది. కౌశల్‌ ఈ సినిమాతో ఘనవిజయం అందుకోవాలి’ అని ఆకాంక్షించారు. కౌశల్‌ మాట్లాడుతూ ‘ఎన్నో ఒడిదుడుకులతో షూటింగ్‌ పూర్తి చేశాం. ప్రేక్షకులు చిన్న సినిమాను కూడా పెద్ద మనసుతో ఆదరించాలి’ అని కోరారు. నిబద్దత, అనుభవంతో రూపొందిన సినిమా ఇదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కౌశల్‌ మాత్రమే న్యాయం చేయగలడు అని నమ్మాం, సక్సెస్‌ కొడతాం అని నిర్మాతలు తెలిపారు.

Updated Date - Dec 30 , 2023 | 09:24 AM