అంతకు మించి భయపెడతాం
ABN, First Publish Date - 2023-08-16T03:03:37+05:30
అశ్విన్ కాకుమణి, పవిత్ర మరిముత్తు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘పిజ్జా 3’. మోహన్ గోవింద్ దర్శకుడు. కనెక్ట్ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని ఈనెల 18న తెలుగులో విడుదల చేస్తోంది...
అశ్విన్ కాకుమణి, పవిత్ర మరిముత్తు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘పిజ్జా 3’. మోహన్ గోవింద్ దర్శకుడు. కనెక్ట్ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని ఈనెల 18న తెలుగులో విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర బృందం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ‘‘తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్‌ని ఎప్పుడూ ఆశీర్వదిస్తారు. ‘పిజ్జా 3’ కూడా తెలుగులో ఘన విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం ఉంద’’న్నారు అశ్విన్. ‘‘పిజ్జా సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాలూ భయపెట్టాయి. ఈసారి అంతకంటే ఎక్కువగా భయపెడతామ’’ని దర్శకుడు తెలిపారు.