కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రేక్షకుల్ని బాగా నవ్విస్తాం

ABN, First Publish Date - 2023-11-21T00:12:58+05:30

వీజే సన్నీ, హ్రితికా శ్రీనివాస్‌ జంటగా నటించిన ‘సౌండ్‌ పార్టీ’ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు రవి పోలిశెట్టి, మహేంద్ర సోమవారం మీడియాతో మాట్లాడుతూ...

వీజే సన్నీ, హ్రితికా శ్రీనివాస్‌ జంటగా నటించిన ‘సౌండ్‌ పార్టీ’ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు రవి పోలిశెట్టి, మహేంద్ర సోమవారం మీడియాతో మాట్లాడుతూ ‘మేం తెలంగాణలో పుట్టి పెరిగాం. అమెరికాలో బిజినెస్‌ చేస్తూ స్నేహితులమయ్యాం. సినిమాల మీద ఆసక్తితో నిర్మాతలుగా మారాం. దాదాపు 25 కథలు విని, ఈ కథ ఫైనలైజ్‌ చేశాం. దర్శకుడు సంజయ్‌ శేరి చెప్పిన కథలో ఇన్సోసెంట్‌ కామెడీ ఉంది. ఫిబ్రవరిలో అమెరికా నుంచి వచ్చి 28 రోజుల్లో చిత్రాన్ని పూర్తి చేశాం. అమెరికాలో కామెడీ చిత్రాలకు ఆదరణ బాగుంటుంది. అందుకే అక్కడ 150 థియేటర్లలో విడుదల చేస్తున్నాం. కుటుంబంలో తండ్రీ కొడుకులు అమాయకులు అయితే మనీ మేకింగ్‌ ఎలా చేస్తారు, ధనికులుగా మారడానికి వారిద్దరూ ఏం చేశారన్నది చిత్ర కథాంశం. పూర్తి వినోదభరితంగా ఉంటుంది. ప్రేక్షకుల్ని బాగా నవ్విస్తాం. ఈ నెల 24న పోటీ బాగా ఉన్నా కథపై నమ్మకంతో ముందుకు వెళుతున్నాం. క్లీన్‌ కామెడీతో తయారైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాం’ అన్నారు. తెలుగులో మరిన్ని సినిమాలు చేయడానికి కథలు వింటున్నామని రవి పోలిశెట్టి, మహేంద్ర చెప్పారు.

Updated Date - 2023-11-21T00:13:02+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!