పొలిమేర 3 పనులు ప్రారంభించాం

ABN , First Publish Date - 2023-10-28T04:50:08+05:30 IST

సత్యం రాజేశ్‌, డాక్టర్‌ కామాక్షి భాస్కర్ల హీరో హీరోయున్లుగా రూపొందిన చిత్రం ‘మా ఊరి పొలిమేర 2’. ‘మా ఊరి పొలిమేర’కు ఇది సీక్వెల్‌. డాక్టర్‌ అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకత్వంలో గౌరికృష్ణ నిర్మించారు...

పొలిమేర 3 పనులు ప్రారంభించాం

సత్యం రాజేశ్‌, డాక్టర్‌ కామాక్షి భాస్కర్ల హీరో హీరోయున్లుగా రూపొందిన చిత్రం ‘మా ఊరి పొలిమేర 2’. ‘మా ఊరి పొలిమేర’కు ఇది సీక్వెల్‌. డాక్టర్‌ అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకత్వంలో గౌరికృష్ణ నిర్మించారు. గెటప్‌ శ్రీను, బాలాదిత్య, చిత్రం శ్రీను ముఖ్యపాత్రలు పోషించారు. నవంబర్‌ 3న విడుదలవుతోంది. ఈ చిత్రంలోని పాత్రల పరిచయ కార్యక్రమాన్ని చిత్రబృందం నిర్వహించింది. ఈ సందర్భంగా సత్యం రాజేశ్‌ మాట్లాడుతూ ‘మా నిర్మాతలు మార్కెట్‌కు మించి ఖర్చుపెట్టారు. ‘పొలిమేర 2’ ప్రేక్ష కులకు ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘నాకు గుర్తింపు తెచ్చిన సినిమా ఇది. ‘పొలిమేర 1’క న్నా 20 రెట్లు బావుంటుంది. త్వరలో ‘పొలిమేర 3’ పనులు మొదలుపెడతాం’ అని చెప్పారు. నవంబర్‌ 3న ఓ థ్రిల్లింగ్‌ చిత్రాన్ని చూడబోతున్నారని వంశీ నందిపాటి పేర్కొన్నారు. సినిమా విజయం పై నాకు పూర్తి నమ్మకం ఉందని నిర్మాత అన్నారు.

Updated Date - 2023-10-28T04:50:08+05:30 IST