తక్కువ సమయంలో పూర్తి చేశాం

ABN , Publish Date - Dec 19 , 2023 | 12:37 AM

విభిన్న పాత్రలతో నటుడిగా అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు పొందారు ధనుష్‌. ఇప్పుడు దర్శకుడిగానూ తనదైన ముద్రతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు...

తక్కువ సమయంలో పూర్తి చేశాం

విభిన్న పాత్రలతో నటుడిగా అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు పొందారు ధనుష్‌. ఇప్పుడు దర్శకుడిగానూ తనదైన ముద్రతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా స్వీయ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ‘డీ 50’ వర్కింగ్‌ టైటిల్‌. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ధనుష్‌ ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఈ చిత్రంలో భాగమైన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అందరి సహకారం వల్లే తక్కువ సమయంలో చిత్రీకరణ పూర్తి చేయగలిగామని పేర్కొన్నారు. దర్శకుడిగా ధను్‌షకు ఇది రెండో చిత్రం. గతంలో ఆయన దర్శకుడిగా ‘పాండీబజార్‌’ చిత్రాన్ని తెరకెక్కించారు. ధనుష్‌ ప్రస్తుతం ‘కెప్టెన్‌ మిల్లర్‌’ చిత్రంతో పాటు శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

Updated Date - Dec 19 , 2023 | 12:37 AM