ఎన్టీఆర్‌ని పిలిచాం కానీ...

ABN , First Publish Date - 2023-03-01T01:12:25+05:30 IST

ఇటీవల ‘హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌’ (హెచ్‌.సి.ఏ) అవార్డు వేడుకల్లో ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్రం మెరిసిన సంగతి తెలిసిందే. ఏకంగా ఐదు అవార్డుల్ని సొంతం చేసుకొని...

ఎన్టీఆర్‌ని పిలిచాం కానీ...

ఇటీవల ‘హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌’ (హెచ్‌.సి.ఏ) అవార్డు వేడుకల్లో ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్రం మెరిసిన సంగతి తెలిసిందే. ఏకంగా ఐదు అవార్డుల్ని సొంతం చేసుకొని, తెలుగు సినిమా సత్తా చాటింది. ఈ వేడుకకు రామ్‌చరణ్‌, రాజమౌళి, కీరవాణి, సింథిల్‌, కార్తికేయ హాజరయ్యారు. కానీ ఎన్టీఆర్‌ మాత్రం కనిపించలేదు. దీనిపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్‌ని ఎందుకు ఆహ్వానించలేదంటూ అభిమానులు హెచ్‌.సి.ఏని ఉద్దేశిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. దాంతో.. హెచ్‌.సి.ఏ స్పందించాల్సివచ్చింది. ఈ మేరకు ఈ సంస్థ ఓ ట్వీట్‌ చేస్తూ ‘‘మేం అవార్డు కార్యక్రమానికి ఎన్టీఆర్‌ని ఆహ్వానించాం. కానీ ఓ కొత్త సినిమా షూటింగ్‌ కారణంగా ఆయన ఈ వేడుకకు రాలేకపోయారు. ఈ విషయాన్ని ఆయన మాతో చెప్పారు. ఆయనకు మేం త్వరలోనే అవార్డు అందజేస్తాం’’ అంటూ వివరణ ఇచ్చింది.

Updated Date - 2023-03-01T01:12:26+05:30 IST