కొత్తవారిని ఫేమస్ చేస్తున్నాం
ABN , First Publish Date - 2023-05-14T02:39:22+05:30 IST
ఛాయ్ బిస్కెట్, లహరి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘మేం ఫేమస్’. 35 మంది నటీనటులు, సాంకేతిక నిపుణుల్నీ ఈ సినిమాతో పరిచయం చేస్తున్నారు...

ఛాయ్ బిస్కెట్, లహరి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘మేం ఫేమస్’. 35 మంది నటీనటులు, సాంకేతిక నిపుణుల్నీ ఈ సినిమాతో పరిచయం చేస్తున్నారు. సుమంత్ ప్రభాస్ దర్శకుడు. ఆయనే హీరో. ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో చిత్రబృందం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘కొత్తవారిని ప్రోత్సహించేందుకే చాయ్ బిస్కెట్ సంస్థ పుట్టింది. అందులో భాగంగా ఈ సినిమాతో 35మందిని తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాం. వాళ్లని ఫేమస్ చేస్తున్నాం. ఈ సినిమాలో 9 పాటలున్నాయి. అన్నీ హుషారుగా సాగేవే. కల్యాణ్ మంచి సంగీతాన్ని అందించార’’న్నారు.