We are doing special shows : ఆ నమ్మకంతోనే ప్రత్యేక ప్రదర్శనలు వేస్తున్నాం

ABN , First Publish Date - 2023-04-13T03:41:54+05:30 IST

మహాకవి కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ కావ్యం కాలాలకు అతీతంగా నిలిచి పాఠకులను ఎంతగా తన్మయులను చేసిందో మా ‘శాకుంతలం’ చిత్రం కూడా ఈ తరం ప్రేక్షకులను...

We are doing special shows : ఆ నమ్మకంతోనే ప్రత్యేక ప్రదర్శనలు వేస్తున్నాం

ఆ నమ్మకంతోనే ప్రత్యేక ప్రదర్శనలు వేస్తున్నాం

మహాకవి కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ కావ్యం కాలాలకు అతీతంగా నిలిచి పాఠకులను ఎంతగా తన్మయులను చేసిందో మా ‘శాకుంతలం’ చిత్రం కూడా ఈ తరం ప్రేక్షకులను అంతే మైమరపిస్తుంది. ఒక గొప్ప సినిమా తీశామనే ప్రగాఢమైన నమ్మకం మాకుంది. అందుకే దిల్‌రాజు సినిమా విడుదలకు ముందే ప్రత్యేక ప్రదర్శనలు వేస్తున్నారు. ప్రతిచోటా ప్రేక్షకుల నుంచి ‘శాకుంతలం’కు చక్కటి స్పందన వస్తోంది’ అని దర్శకుడు గుణశేఖర్‌ అన్నారు. ఆయన దర్శకత్వంలో కావ్యనాయకి శకుంతలగా సమంత టైటిల్‌ పాత్ర పోషించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా గుణశేఖర్‌ ‘శాకుంతలం’ విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

  • లాక్‌డౌన్‌ సమయంలో మంచి ప్రేమకథతో ఓ సినిమా చేద్దామనిపించింది. పురాణాలు, ఇతిహాసాలు చదువుతుంటే కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ నన్ను ఆకర్షించింది. శకుంతల కథ నన్ను చాలా ఎగ్జయిట్‌ చేసింది. అందుకే ప్రేక్షకులకు చెప్పాలనుకున్నాను.

  • ‘శాకుంతలం’ ప్రేమకథే అయినా అంతర్లీనంగా చాలా అంశాలు అందులో మిళితమై ఉన్నాయి. శకుంతల అనగానే కావ్యనాయకి గుర్తొస్తుంది కానీ ఆమెలో అంతర్గతంగా చాలా శక్తి ఉంది. ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఎంత పోరాటం అయినా చేయగల సత్తా శకుంతల సొంతం. కాళిదాసు తనదైన శైలిలో పాత్రలను మలచిన తీరు ఈ తరం ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుందని అనిపించింది.

  • శకుంతల పాత్రలోని రొమాంటిక్‌ యాంగిల్‌ను పక్కన పెట్టాను. సమంత అద్భుతమైన నటి కాబట్టి ఆమె అభినయానికి పెద్ద పీట వేశాను. తన ఆత్మాభిమానం కోసం శకుంతల రాజులు, రాజ్యాలను లెక్క చేయలేదు. పోరాడి గెలిచింది. అప్పట్లో పెళ్లికాకుండానే తల్లవ్వడం సమాజం దృష్టిలో పెద్ద నేరం. అలాంటి పరిస్థితులకు ఆమె ఎలా ఎదురొడ్డినిలిచింది అనేది కథాంశం. ఆమె పోరాట స్ఫూర్తి ఈతరం అమ్మాయిలకు నచ్చుతుంది.

  • ప్రీ ప్రొడక్షన్‌కు ఏడాది, షూటింగ్‌కు ఐదు నెలలు, పోస్ట్‌ ప్రొడక్షన్‌కు ఏడాదిన్నర పట్టింది. శకుంతలకు జంతువులే స్నేహితులు. జంతువులతో రూపొందే సన్నివేశాలను సహజంగా ఉండేందుకు కష్టంతో పాటు చాలా ఖర్చూ అయింది. కశ్మీర్‌లోని అడవుల్లో చాలా లోపలకు వెళ్లి చిత్రీక రణ చేశాం. మణిశర్మ అందించిన సంగీతం సినిమాకు ప్రత్యేకాకర్షణగా నిలుస్తుంది.

  • సమంత ఇప్పటిదాకా చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా కనిపించాల్సి ఉండడంతో ముందుగా చాలా రీసెర్చి చేసి, కొన్ని ప్రమాణాలను నిర్దేశించుకున్నాం. శకుంతల పాత్ర కోసం సమంత నటనలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.

  • ఫ దుష్యుంతుడి పాత్రకు దేవ్‌మోహన్‌ చక్కగా కుదిరాడు. ఎంత సమయమైనా ఇస్తాననడంతో అతన్ని ఎంపిక చేశాం. దుర్వాస ముని పాత్రకు మీరు తప్ప ప్రత్యామ్నాయం లేదని అడగ్గానే మోహన్‌బాబు ఒప్పుకొన్నారు.

Updated Date - 2023-04-13T03:41:56+05:30 IST