Watch with family : ఫ్యామిలీతో కలసి చూడండి!
ABN , First Publish Date - 2023-09-06T03:35:16+05:30 IST
‘నిశబ్దం’ తర్వాత అనుష్క శెట్టి ‘మిస్ శెట్టి... మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంతో మళ్లీ తెరమీద కనిపించనున్నారు. అందులో ఆమె పాత్ర ఎలా ఉండబోతోంది? ప్రేక్షకులు ఈ సినిమా నుంచి ఏమి ఆశించవచ్చు అనే విషయాలను అనుష్క చిత్రజ్యోతితో పంచుకున్నారు....

‘నిశబ్దం’ తర్వాత అనుష్క శెట్టి ‘మిస్ శెట్టి... మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంతో మళ్లీ తెరమీద కనిపించనున్నారు. అందులో ఆమె పాత్ర ఎలా ఉండబోతోంది? ప్రేక్షకులు ఈ సినిమా నుంచి ఏమి ఆశించవచ్చు అనే విషయాలను అనుష్క చిత్రజ్యోతితో పంచుకున్నారు..
‘‘మూడు సంవత్సరాల తర్వాత మళ్లీ నా సినిమా వస్తోంది. సినిమాల నుంచి ఒక బ్రేక్ కావాలనుకున్నా.. తీసుకున్నా. ‘మిస్ శెట్టి... మిస్టర్ పొలిశెట్టి’ ప్రేక్షకులకు ఎంతో నచ్చుతుంది. వారికి కావాల్సిన అన్ని రకాల ఎమోషన్స్ దీనిలో ఉన్నాయి. ఒక అందమైన ప్రేమకథ ఇది. కుటుంబమంతా కలసి చూడదగ్గ సినిమా ఇది. థియేటర్‌లోంచి ప్రేక్షకులు చాలా హ్యాపీగా బయటకు వస్తారనే నమ్మకం నాకు ఉంది. ఈ మూడేళ్ల గ్యాప్‌లో నేను చాలా స్ర్కిప్ట్స్ విన్నా. వాటిలో కొన్ని నచ్చాయి కూడా. కానీ ఈ సినిమా చాలా ప్రత్యేకమైనది. దీని కథాంశం చాలా భిన్నమైనది. నా అభిమానులందరికి తప్పనిసరిగా నచ్చుతుంది. కొవిడ్ తర్వాత మన జీవితాల్లో అనేక మార్పులు వచ్చాయి. అదే విధంగా పదేళ్ల క్రితం నాటికి.. ప్రస్తుతానికి సమాజం కూడా చాలా మారింది. ఒకప్పుడు స్టాండప్ కామెడీ అనేది ఎవరో కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇప్పుడు చాలా మందికి తెలుసు. ఈ సినిమా తర్వాత ఇంకా ఎక్కువ మందికి తెలుస్తుంది. అనేక మంది యువతీ, యువకులు దీనిని ఒక వృత్తిగా కూడా స్వీకరిస్తారనుంటున్నా. షూటింగ్ చేస్తున్నప్పుడు ఆనందంతో నా కళ్లలో నీళ్లు వచ్చాయి. ఎందుకంటే నా జీవితంలో సగభాగం సినీ పరిశ్రమలోనే ఉన్నా. సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక మ్యాజిక్ ఉంది. ఆ మ్యాజిక్‌ను ఎంత మిస్ అయ్యానో ఇప్పుడు తెలుస్తోంది. నేను ప్రేక్షకులకు దూరమయిపోయాననుకుంటున్నారు. కాని వారికి ఎప్పూడూ దూరం కాలేదు. వారు కూడా నన్ను ఆదరిస్తూనే ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఆదరిస్తారనే నమ్మకం నాకుంది.