సినిమా చూస్తే తెలుస్తుంది!

ABN , First Publish Date - 2023-03-01T01:01:29+05:30 IST

దర్శకుడిగా తొలి చిత్రం ‘ఆర్‌ఎక్స్‌ 100’తో సత్తా చాటారు అజయ్‌ భూపతి. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రానికి ‘మంగళవారం’ అనే టైటిల్‌ అధికారికంగా...

సినిమా చూస్తే తెలుస్తుంది!

దర్శకుడిగా తొలి చిత్రం ‘ఆర్‌ఎక్స్‌ 100’తో సత్తా చాటారు అజయ్‌ భూపతి. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రానికి ‘మంగళవారం’ అనే టైటిల్‌ అధికారికంగా ఖరారైంది. చిత్రబృందం మంగళవారం కాన్సెప్ట్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. స్వాతి గునుపాటి, సురేశ్‌ వర్మ ఎం.తో కలసి అజయ్‌ భూపతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో విడుదలవుతోంది. అజయ్‌ భూపతి మాట్లాడుతూ ‘సరికొత్త కాన్సె్‌ప్టతో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఇండియాలో ఇప్పటి దాకా ఎవరూ ఈ జానర్‌ను టచ్‌ చేయలేదు. ‘మంగళవారం’ టైటిల్‌ ఎందుకు పెట్టామనేది సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమాలో 30 పాత్రలు ఉన్నాయి. ప్రతి పాత్రకూ ప్రాముఖ్యం ఉంది’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘ఇది దక్షిణాది చిత్రం. ‘ఆర్‌ఎక్స్‌ 100’లానే అజయ్‌భూపతి ఈ చిత్రంతోనూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తారు. ‘కాంతార’ ఫేమ్‌ అజనీష్‌ లోకనాథ్‌ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలె చిత్రీకరణ ప్రారంభమైంది. నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర

Updated Date - 2023-03-01T01:01:31+05:30 IST