వార్ వచ్చేది అప్పుడేనా..?
ABN , First Publish Date - 2023-08-08T03:45:25+05:30 IST
ఎన్టీఆర్ తొలిసారి ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్‌లో భాగం పంచుకొంటున్నారు. అదే.. ‘వార్ 2’. హృతిక్ రోషన్‌తో ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న చిత్రమిది. ఈ కాంబినేషన్ సెట్ అవ్వగానే...

ఎన్టీఆర్ తొలిసారి ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్‌లో భాగం పంచుకొంటున్నారు. అదే.. ‘వార్ 2’. హృతిక్ రోషన్‌తో ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న చిత్రమిది. ఈ కాంబినేషన్ సెట్ అవ్వగానే, ఈ సినిమాపై అంచనాలు భారీ ఎత్తున పెరిగిపోయాయి. యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించనుంది. దేశంలోని అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఇదొకటిగా ఇప్పటికే ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ యేడాది చివర్లో చిత్రీకరణ ప్రారంభం కానుంది. 2025 జనవరి 26న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నార్ట. యేడాదిలోపే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలన్నది ప్లాన్. ఇద్దరు స్టార్ హీరోలతో, ఓ భారీ యాక్షన్ చిత్రాన్ని యేడాదిలో పూర్తి చేయాలనుకోవడం సాహసమే. అయితే కట్టుదిట్టమైన ప్రణాళికతో ముందుకెళ్తే.. ‘వార్ 2’ అనుకొన్న సమయానికి పూర్తి చేయొచ్చు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ‘వార్ 2’కి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వస్తాయి.