సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అలాంటి పాత్రలో కనిపించాలని ఉంది!

ABN, First Publish Date - 2023-01-21T05:35:43+05:30

‘ప్రేమిస్తే’, ‘యువసేన’ తదితర చిత్రాలతో ఆకట్టుకొన్నారు భరత్‌. తమిళ చిత్రసీమలో బిజీ హీరో అయిపోయారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ప్రేమిస్తే’, ‘యువసేన’ తదితర చిత్రాలతో ఆకట్టుకొన్నారు భరత్‌. తమిళ చిత్రసీమలో బిజీ హీరో అయిపోయారు. చాలా కాలం తరవాత తెలుగులో చేసిన చిత్రం ‘హంట్‌’. సుధీర్‌బాబు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని ఈనెల 26న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా భరత్‌ మాట్లాడుతూ ‘‘దాదాపు పన్నేండేళ్ల తరవాత తెలుగులో నటిసున్నాను. ఈ గ్యాప్‌లో కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ తమిళ, మలయాళ చిత్రసీమల్లో బిజీగా ఉండడం వల్ల చేయలేదు. దర్శకుడు మహేశ్‌ కథ చెప్పగానే బాగా నచ్చింది. సుధీర్‌బాబు నాకు చాలాకాలంగా తెలుసు. మంచి స్నేహితుడు. శ్రీకాంత్‌గారితో కూడా పరిచయం ఉంది. అందుకే ఈ సినిమాలో నటించడానికి ముందుకొచ్చా. ఆర్యన్‌ దేవ్‌ అనే ఐపీఎస్‌ అధికారి పాత్రలో కనిపించనున్నా. సుధీర్‌, శ్రీకాంత్‌ పాత్రలతో పోటా పోటీగా ఆర్యన్‌ క్యారెక్టర్‌ తీర్చిదిద్దారు. యాక్షన్‌, ఎమోషన్‌, క్రైమ్‌.. ఇలా అన్ని అంశాలూ ఈ కథలో ఉంటాయి. యాక్షన్‌ సీన్లకు పెద్ద పీట వేశారు. అందుకోసం విదేశాల నుంచి ఫైట్‌ మాస్టర్లని తీసుకొచ్చారు. తెలుగులో ఈ చిత్రం నాకు మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకం ఉంది. మంచి అవకాశాలు వస్తే తెలుగులో తప్పకుండా నటిస్తా. అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేయాలని ఉంది. రాజమౌళి, సుకుమార్‌ ఈ దర్శకులందరితోనూ కలిసి పనిచేయాలని ఉంది. నేను ఇప్పటి వరకూ రకరకాల పాత్రలు చేశా. కానీ పూర్తి స్థాయి కామెడీ పాత్ర చేయలేదు. అలాంటి పాత్ర లో కనిపించాలని ఉంది.’’న్నారు.

Updated Date - 2023-01-21T05:35:46+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!