పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తాం
ABN , First Publish Date - 2023-04-24T00:34:45+05:30 IST
‘‘విరూపాక్ష’ చిత్రం సక్సెస్ ఘనత నాదో, మా టీమ్‌దో కాదు, ప్రేక్షకులదే. మాకు నచ్చేలా సినిమాలు తీయండి ఆదరిస్తాం అని ప్రేక్షకులు విసిరిన సవాల్‌కు జవాబే మా ‘విరూపాక్ష’’ అని హీరో సాయితేజ్ అన్నారు.

‘‘విరూపాక్ష’ చిత్రం సక్సెస్ ఘనత నాదో, మా టీమ్‌దో కాదు, ప్రేక్షకులదే. మాకు నచ్చేలా సినిమాలు తీయండి ఆదరిస్తాం అని ప్రేక్షకులు విసిరిన సవాల్‌కు జవాబే మా ‘విరూపాక్ష’’ అని హీరో సాయితేజ్ అన్నారు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రం ఇటీవలె విడుదలై ప్రేక్షకాధరణ పొందడంతో పాటు సాయితేజ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించే దిశగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా ‘విరూపాక్ష’ చిత్రబృందం ఆదివారం సక్సె్‌సమీట్‌ను నిర్వహించింది. సాయితేజ్ మాట్లాడుతూ ‘‘విరూపాక్ష’ బ్లాక్‌బస్టర్ అయింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’ అని చెప్పారు. చిత్ర దర్శకుడు కార్తీక్ దండు మాట్లాడుతూ ‘మా డైరెక్షన్ టీమ్ నా బలం. ఈ సినిమాకు సపోర్ట్ చేసినవారందరికీ రుణపడి ఉంటాను’ అన్నారు. ‘విరూపాక్ష’ సక్సె్‌సలో భాగమవ్వడం ఆనందంగా ఉందని సంయుక్తామీనన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో గోపీచంద్ మలినేని, మారుతి పాల్గొన్నారు.