విరించి వర్మ... యాక్షన్‌ డ్రామా

ABN , First Publish Date - 2023-05-25T01:54:07+05:30 IST

‘ఉయ్యాల జంపాల’, ‘మజ్ను’ చిత్రాలతో ఆకట్టుకొన్నారు విరించి వర్మ. రెండూ ప్రేమ కథలే. ఈసారి ఓ యాక్షన్‌ డ్రామాని తెరకెక్కించనున్నారు. ముదుగంటి క్రియేషన్స్‌

విరించి వర్మ... యాక్షన్‌ డ్రామా

‘ఉయ్యాల జంపాల’, ‘మజ్ను’ చిత్రాలతో ఆకట్టుకొన్నారు విరించి వర్మ. రెండూ ప్రేమ కథలే. ఈసారి ఓ యాక్షన్‌ డ్రామాని తెరకెక్కించనున్నారు. ముదుగంటి క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. హీరో, హీరోయిన్లుగా కొత్తవారు పరిచయం అవుతున్నారు. 1980 నాటి కథ ఇది. తెలంగాణ నేపథ్యంలో సాగుతుంది. కొన్ని వాస్తవ ఘటనల్ని ఆధారంగా చేసుకొని దర్శకుడు ఈ కథ రాసుకొన్నారు. ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్‌, కెమెరా: జ్ఞానశేఖర్‌, కళ: నాగేంద్ర కుమార్‌.

Updated Date - 2023-05-25T01:54:07+05:30 IST