ప్రేమకథలో విరహ గీతం
ABN , First Publish Date - 2023-02-15T00:12:41+05:30 IST
ప్రేమజంట ప్రయాణం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఓ సాథియా’. ఆర్యన్ గౌరి, మిష్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు...
ప్రేమజంట ప్రయాణం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఓ సాథియా’. ఆర్యన్ గౌరి, మిష్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. దివ్య భావన దర్శకత్వంలో చందన కట్టా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘వెళ్లిపోయే.... పాపా వెళ్లిపోయే’ అంటూ సాగే గీతాన్ని దర్శకుడు క్రిష్ విడుదల చేశారు. పాట విడుదల అనంతరం క్రిష్ మాట్లాడుతూ.. ఓ సాథియా సినిమా యూనిట్ మొత్తానికి బెస్ట్ విషెస్ చెప్పారు. సాంగ్ చాలా బాగా వచ్చిందని, ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని అన్నారు.
వెళ్లిపోయే.. పాపా వెళ్లిపోయే.. అంటూ సాగిపోయే ఈ బ్రేకప్ సాంగ్ లో యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. భాస్కరభట్ల రాసిన పదాల కూర్పులో నిజమైన ప్రేమికుడి భావాలు మనసుకు హత్తుకుంటున్నాయి. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన తీరు.. సాంగ్ కి తగ్గట్టుగా బాబా భాస్కర్ కొరియోగ్రఫీ ఈ పాటలో హైలైట్ అయ్యాయి. వినోద్ కుమార్ (విన్ను) అందించిన మ్యూజిక్ ఈ సాంగ్‌కి మేజర్ అట్రాక్షన్ కానుంది. అతిత్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు మేకర్స్.