VBVK: మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విన్నర్ చేతుల మీదుగా ‘బంగారం’ సాంగ్

ABN , First Publish Date - 2023-01-19T21:53:07+05:30 IST

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ (GA 2 Pictures) బ్యాన‌ర్‌పై రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ (Vinaro Bhagyamu Vishnu Katha). తిరుమల తిరుపతి నేపథ్యంలో

VBVK: మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విన్నర్ చేతుల మీదుగా ‘బంగారం’ సాంగ్
Vinaro Bhagyamu Vishnu Katha Movie Still

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ (GA 2 Pictures) బ్యాన‌ర్‌పై రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ (Vinaro Bhagyamu Vishnu Katha). తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో ముర‌ళి కిషోర్ అబ్బూరు (Murali Kishore Abburu) ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా, క‌శ్మీర ప‌ర్ధేశీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సక్సెస్‌ఫుల్ నిర్మాత బన్నీ వాసు నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ‘వాసవసుహాస’ పాట మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా ఈ చిత్ర సెకండ్ సింగిల్ ‘ఓ బంగారం’ను చిత్రబృందం విడుదల చేసింది. దీనికిగానూ VVIT గుంటూరు కాలేజ్ క్రికెట్ టీమ్‌తో మ్యాచ్ నిర్వహించి.. ఆ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్లేయర్‌తో ఈ సింగిల్‌ను విడుదల చేశారు. ఈ మ్యాచ్ లో VVIT గుంటూరు కాలేజ్ క్రికెట్ టీమ్ 123 రన్స్ చేయగా.. దానిలో K.సైదులు అనే ప్లేయర్ హాఫ్ సెంచరీ చేయడంతో.. అతనిని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ విన్నర్‌గా ప్రకటించి.. అతని చేతుల మీదుగా ఈ పాటను చిత్రబృందం విడుదల చేసింది (VBVK vs VVIT). ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ పాట మార్కెట్‌లోకి విడుదలైంది.

పాట విడుదల సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) మాట్లాడుతూ.. ఖచ్చితంగా ఈ సినిమా మీకు నచ్చుతుంది. ఈ సినిమా టెక్నీషియన్స్ అందరికీ థాంక్యూ సో మ్యాచ్. మా ప్రొడ్యూసర్ వాసు గారు ఈ సినిమాను మీకు దగ్గర చెయ్యాలని చెప్పి నెల ముందు నుంచి ప్రొమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ సాంగ్ నాకు చాలా స్పెషల్. భాస్కరభట్ల గారు నాకు మంచి లిరిక్స్ ఇచ్చారు. అబ్బాయిలకు మ్యాచ్ పెట్టారు, మరి అమ్మాయిలకు సంబంధించి ఏమున్నాయి అంటే...

దీనికి బన్నీవాసు స్పందించి... ఈ సాంగ్‌ను రీల్‌గా చేసి గీతా ఆర్ట్స్‌కు ట్యాగ్ చేస్తే, సెలెక్ట్ అయినా 10 మందికి, వాళ్ళ ఫ్యామిలీ‌కి ఈ సినిమాను చూపించి.. వాళ్ళను పుష్ప షూటింగ్‌కి కూడా తీసుకెళ్లనున్నట్లు ప్రకటించారు.

పాట విషయానికి వస్తే.. ‘ఓ బంగారం నీ చెయ్యి తాకగానే.. ఉప్పొంగిపోయిందే నా ప్రాణం’ అనే ఈ పాటను భాస్కరభట్ల రచించారు. కపిల్ కపిలన్ ఆలపించారు. చైతన్య భరద్వాజ్ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు విశ్వరఘు కొరియోగ్రఫీ చేశారు. కాగా.. బాబు స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ సినిమాని 2023 ఫిబ్రవరి 17న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - 2023-01-19T21:53:08+05:30 IST