పల్లెటూరి పంచాయితీ

ABN , First Publish Date - 2023-03-25T02:41:05+05:30 IST

భరత్‌,విషికా లక్ష్మణ్‌లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘ఏందిరా ఈ పంచాయితీ’. గ్రామీణ వాతావరణం నేపథ్యంలో గంగాధర టీ దర్శకత్వంలో ప్రదీ్‌పకుమార్‌ ఎం నిర్మిస్తున్న...

పల్లెటూరి పంచాయితీ

భరత్‌,విషికా లక్ష్మణ్‌లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘ఏందిరా ఈ పంచాయితీ’. గ్రామీణ వాతావరణం నేపథ్యంలో గంగాధర టీ దర్శకత్వంలో ప్రదీ్‌పకుమార్‌ ఎం నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ లోగోను శుక్రవారం విడుదల చేశారు. కత్తెర, కోడి, బోరింగ్‌, తాటిచెట్లు, మనుషులు పరిగెత్తడం వంటివి ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నాయి. అంటే ఒక ఊర్లో ఉండే సహజమైన వాతావరణాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నట్లు ఈ పోస్టర్‌ చూస్తే అర్థమవుతుంది. కాశీ విశ్వనాథ్‌, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్‌సాగర్‌, సమీర్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: వెంకట్‌ పాల్వాయి, ప్రియాంక ఎరుకల, సంగీతం: పెద్దపల్లి రోహిత్‌, ఛాయాగ్రహణం: సతీశ్‌ మాసం, ఎడిటింగ్‌: జేపీ.

Updated Date - 2023-03-25T02:41:09+05:30 IST