సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

విజయ్‌ దేవరకొండ స్పై ఫిల్మ్‌

ABN, First Publish Date - 2023-01-14T01:31:46+05:30

విజయ్‌ దేవరకొండ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫ్యార్య్చూన్‌ ఫోర్‌ సంస్థలు సంయుక్తంగా ఓ భారీ చిత్రాన్ని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయ్‌ దేవరకొండ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫ్యార్య్చూన్‌ ఫోర్‌ సంస్థలు సంయుక్తంగా ఓ భారీ చిత్రాన్ని నిర్మించనున్నాయి. విజయ్‌కు ఇది 12వ చిత్రం కావడం గమనార్హం. శ్రీకర్‌ స్టూడియోస్‌ సమర్పణలో ఎస్‌.నాగవంశీ, సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇంతకుముందు నాని హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలోనే సితార సంస్థ నిర్మించిన ‘జెర్సీ’ చిత్రం స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో రూపుదిద్దుకుని ఘన విజయం సాధించిన సంగతి విదితమే. ‘అంచానాలను అధిగమించి, అందరినీ అలరించే రీతిలో ఈ సినిమా ఉంటుంది. ఇదొక అద్భుత ప్రయత్నం’ అని నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ చెప్పారు. విజయ్‌ దేవరకొండలోని ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించే విధంగా సినిమా ఉంటుందని దర్శకుడు గౌతమ్‌ చెప్పారు. ఈ చిత్రం వివరాలను ప్రకటిస్తూ కాన్సెప్ట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఇందులో ఓ వ్యక్తి పోలీస్‌ దుస్తుల్లో ముఖానికి ముసుగు ధరించి ఉన్నాడు. ఇదొక స్పై ఫిల్మ్‌ అని పోస్టర్‌ను బట్టి అర్థమవుతుంది. అలాగే సముద్ర తీరంలో యుధ్ద సన్నివేశాన్ని తలపించేలా మంటల్లో దగ్ధమవుతున్న పడవలతో ఈ పోస్టర్‌ను ఆసక్తి పెంచేలా రూపొందించారు. ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది.

Updated Date - 2023-01-14T01:31:50+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!