విజయ్ దేవరకొండ స్పై ఫిల్మ్
ABN , First Publish Date - 2023-01-14T01:31:46+05:30 IST
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫ్యార్య్చూన్ ఫోర్ సంస్థలు సంయుక్తంగా ఓ భారీ చిత్రాన్ని..
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫ్యార్య్చూన్ ఫోర్ సంస్థలు సంయుక్తంగా ఓ భారీ చిత్రాన్ని నిర్మించనున్నాయి. విజయ్‌కు ఇది 12వ చిత్రం కావడం గమనార్హం. శ్రీకర్ స్టూడియోస్ సమర్పణలో ఎస్.నాగవంశీ, సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇంతకుముందు నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలోనే సితార సంస్థ నిర్మించిన ‘జెర్సీ’ చిత్రం స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపుదిద్దుకుని ఘన విజయం సాధించిన సంగతి విదితమే. ‘అంచానాలను అధిగమించి, అందరినీ అలరించే రీతిలో ఈ సినిమా ఉంటుంది. ఇదొక అద్భుత ప్రయత్నం’ అని నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ చెప్పారు. విజయ్ దేవరకొండలోని ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించే విధంగా సినిమా ఉంటుందని దర్శకుడు గౌతమ్ చెప్పారు. ఈ చిత్రం వివరాలను ప్రకటిస్తూ కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో ఓ వ్యక్తి పోలీస్ దుస్తుల్లో ముఖానికి ముసుగు ధరించి ఉన్నాడు. ఇదొక స్పై ఫిల్మ్ అని పోస్టర్‌ను బట్టి అర్థమవుతుంది. అలాగే సముద్ర తీరంలో యుధ్ద సన్నివేశాన్ని తలపించేలా మంటల్లో దగ్ధమవుతున్న పడవలతో ఈ పోస్టర్‌ను ఆసక్తి పెంచేలా రూపొందించారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.