విజయ్ ఆంటోనీ కుమార్తె ఆత్మహత్య
ABN , First Publish Date - 2023-09-20T00:53:53+05:30 IST
ప్రముఖ నటుడు విజయ్ ఆంటోనీ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన పెద్ద కుమార్తె మీరా విజయ్ ఆంటోనీ (16) మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. నగరంలోని చర్చిపార్క్ స్కూల్‌లో 12వ తరగతి చదువుతున్న మీరా.

ప్రముఖ నటుడు విజయ్ ఆంటోనీ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన పెద్ద కుమార్తె మీరా విజయ్ ఆంటోనీ (16) మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. నగరంలోని చర్చిపార్క్ స్కూల్‌లో 12వ తరగతి చదువుతున్న మీరా.. మానసిక ఒత్తిడి కారణంగా బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. స్థానిక ఆళ్వార్‌పేట, టీటీకే రోడ్డులో విజయ్ ఆంటోనీ కుటుంబం నివసిస్తోంది. విజయ్ ఆంటోనీ - ఫాతిమా ఆంటోనీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో మీరా విజయ్ ఆంటోనీ సోమవారం రాత్రి నిద్రపోయేందుకు పడక గదిలోకి వెళ్ళింది. మంగళవారం వేకువజామున 3 గంటల సమయంలో మీరా పడకగదికి విజయ్ ఆంటోనీ వెళ్ళి చూడగా ఉరేసుకుని కనిపించింది. వెంటనే సమీపంలోని కావేరీ ఆస్పత్రికి తరలించగా, అక్కడ వైద్యులు పరీక్షించి.. అప్పటికే ఆమె చనిపోయినట్టు నిర్థారించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ఆంధ్రజ్యోతి, చెన్నై