వెంకీ... యాక్షన్‌ డ్రామా

ABN , First Publish Date - 2023-01-24T04:54:59+05:30 IST

కథానాయకుడిగా వెంకటేశ్‌ది సుదీర్ఘమైన ప్రయాణం. ఇప్పుడో అరుదైన మైలు రాయి చేరుకొన్నారు...

వెంకీ... యాక్షన్‌ డ్రామా

కథానాయకుడిగా వెంకటేశ్‌ది సుదీర్ఘమైన ప్రయాణం. ఇప్పుడో అరుదైన మైలు రాయి చేరుకొన్నారు. నటుడిగా 75వ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ‘హిట్‌’, ‘హిట్‌ 2’ చిత్రాలతో ఆకట్టుకొన్న శైలేశ్‌ కొలను దర్శకత్వం వహించే ఈ చిత్రానికి వెంకట్‌ బోయనపల్లి నిర్మాత. సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. వెంకీ ప్రీ లుక్‌ పోస్టర్‌ని కూడా బయటకు వదిలారు. ఇదో యాక్షన్‌ డ్రామా అనే సంగతి ప్రీ లుక్‌ చూస్తేనే అర్థమైపోతోంది. భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. వెంకటేశ్‌ పాత్ర ఇది వరకెప్పుడూ చూడని రీతిలో తీర్చిదిద్దుతున్నట్టు దర్శక నిర్మాతలు తెలిపారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని బుధవారం ప్రకటిస్తారు.

Updated Date - 2023-01-24T04:54:59+05:30 IST