‘నైన్‌టీస్‌.. ఎ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’ టీజర్‌ను వెంకటేశ్‌ విడుదల చేశారు

ABN , First Publish Date - 2023-11-02T02:35:12+05:30 IST

శివాజీ, వాసుకీ ఆనంద్‌ ప్రధాన పాత్రలు పోషించిన వెబ్‌ సిరీస్‌ ‘నైన్‌టీస్‌.. ఎ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’ టీజర్‌ను వెంకటేశ్‌ విడుదల చేశారు...

‘నైన్‌టీస్‌.. ఎ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’ టీజర్‌ను  వెంకటేశ్‌ విడుదల చేశారు

శివాజీ, వాసుకీ ఆనంద్‌ ప్రధాన పాత్రలు పోషించిన వెబ్‌ సిరీస్‌ ‘నైన్‌టీస్‌.. ఎ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’ టీజర్‌ను వెంకటేశ్‌ విడుదల చేశారు. ప్రతి మధ్యతరగతి కుటుంబాన్ని ప్రతిబింబించే ఈ వెబ్‌ సిరీస్‌ను రాజశేఖరం మేడారం నిర్మిస్తున్నారు. ఆదిత్య హాసన్‌ దర్శకుడు. ఇందులో స్కూల్‌ మాస్టర్‌గా శివాజీ, ఆయన భార్యగా వాసుకీ నటించారు. వారి ముగ్గురు పిల్లలు, ఆ కుటుంబం చుట్టూ అల్లుకున్న సన్నివేశాలతో సిరీస్‌ రూపుదిద్దుకుంటోందని దర్శకుడు చెప్పారు. ఈటీవీ విన్‌ యాప్‌ ద్వారా వచ్చే సంక్రాంతికి ఈ వెబ్‌ సిరీస్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - 2023-11-02T02:35:19+05:30 IST