వినోదం సందేశం కలబోతగా వేద

ABN , First Publish Date - 2023-02-08T02:40:48+05:30 IST

‘ఇక నుంచి నేను నటించే అన్ని చిత్రాలను పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేస్తాం. నా భార్య గీతా శివరాజ్‌కుమార్‌ నిర్మించిన ‘వేద’ చిత్రంలో వినోదంతో పాటు మంచి సందేశం...

వినోదం సందేశం కలబోతగా వేద

‘ఇక నుంచి నేను నటించే అన్ని చిత్రాలను పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేస్తాం. నా భార్య గీతా శివరాజ్‌కుమార్‌ నిర్మించిన ‘వేద’ చిత్రంలో వినోదంతో పాటు మంచి సందేశం ఉంది. ప్రేక్షకులు ఒక మంచి సినిమా చూసిన అనుభూతిని పొందుతారు’ అని కన్నడ హీరో శివరాజ్‌కుమార్‌ అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపుదిద్దుకున్న చిత్రం ‘వేద’. కన్నడనాట ఘన విజయం అందుకున్న ఈ చిత్రం ఈ నెల 9న తెలుగులో విడుదలవుతోంది. హర్ష దర్శకుడు. నిర్మాత ఎం.వి. ఆర్‌ కృష్ణ తెలుగులో విడుదల చేస్తున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా హర్ష మాట్లాడుతూ ‘శివరాజ్‌కుమార్‌కు ఇది 125 వ చిత్రం. 1960 నేపథ్యంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించిన విభిన్న చిత్రం ఇది. మా సినిమాను కృష్ణగారు తెలుగులో విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది’ అన్నారు. తెలుగు ప్రేక్షకులు ‘వేద’ చిత్రాన్ని ఆదరించాలని ఎం.వి.ఆర్‌ కృష్ణ కోరారు.

Updated Date - 2023-02-08T02:40:50+05:30 IST