విడుదలకు సిద్ధమైన వేద

ABN , First Publish Date - 2023-01-30T00:41:06+05:30 IST

కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ నటించిన చిత్రం ‘వేద’. హర్ష దర్శకుడు. శాండిల్‌వుడ్‌లో విడుదలై సంచనల విజయం సాధించింది...

విడుదలకు సిద్ధమైన వేద

కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ నటించిన చిత్రం ‘వేద’. హర్ష దర్శకుడు. శాండిల్‌వుడ్‌లో విడుదలై సంచనల విజయం సాధించింది. శివరాజ్‌ కుమార్‌ నటించిన 125వ చిత్రం ఇది. ఇప్పుడు తెలుగులోనూ విడుదల అవుతోంది. గీతా శివరాజ్‌ కుమార్‌ నిర్మాత. తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న వి.ఆర్‌.కృష్ణ మండపాటి మాట్లాడుతూ ‘‘కన్నడలో ‘వేద’ అఖండ విజయాన్ని సొంతం చేసుకొంది. తెలుగు హక్కుల కోసం గట్టి పోటీ ఏర్పడింది. నాపై నమ్మకంతో శివరాజ్‌ కుమార్‌ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చారు. త్వరలోనే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహిస్తామ’’న్నారు.

Updated Date - 2023-01-30T00:41:08+05:30 IST