వి.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వెండితెర అవార్డ్స్‌ వేడుకలు

ABN , Publish Date - Dec 31 , 2023 | 04:44 AM

వి.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వెండితెర అవార్డ్స్‌ వేడుకలో సీనియర్‌ నటులు మురళీమోహన్‌కు ‘నటసింహ చక్రవర్తి’ బిరుదును ప్రదానం చేశారు. 50ఏళ్ల నటజీవితాన్ని పూర్త్తిచేసుకున్న సందర్భంగా..

వి.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వెండితెర అవార్డ్స్‌ వేడుకలు

వి.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వెండితెర అవార్డ్స్‌ వేడుకలో సీనియర్‌ నటులు మురళీమోహన్‌కు ‘నటసింహ చక్రవర్తి’ బిరుదును ప్రదానం చేశారు. 50ఏళ్ల నటజీవితాన్ని పూర్త్తిచేసుకున్న సందర్భంగా ఈ సత్కారం నిర్వహించినట్టు సంస్థ అధినేత విష్ణు బొప్పన తెలిపారు. తెలంగాణ సినిమాటోగ్రఫి మినిస్టర్‌ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతులమీదుగా ఈ సత్కారం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులతోపాటు చలనచిత్ర నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్‌, నిర్మాత అంబికా కృష్ణ, దర్శకులు అను రాఘవపూడి, వశిష్ఠ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 04:44 AM