జతగాళ్లు వస్తున్నారు

ABN , First Publish Date - 2023-09-07T02:14:21+05:30 IST

సాయిపవన్‌, ప్రియాంక హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న చిత్రం ‘వారెవ్వా జతగాళ్లు’. గుండు మురళి, భాస్కర్‌, మమత కీలకపాత్రలు పోషిస్తున్నారు.

జతగాళ్లు వస్తున్నారు

సాయిపవన్‌, ప్రియాంక హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న చిత్రం ‘వారెవ్వా జతగాళ్లు’. గుండు మురళి, భాస్కర్‌, మమత కీలకపాత్రలు పోషిస్తున్నారు. సత్య సలాది దర్శకత్వంలో బి. నాగబాబు, డి. వీర ప్రభాకర్‌, జీ. వీరబాబు నిర్మిస్తున్నారు. విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 22న ‘వారెవ్వా జతగాళ్లు’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు బుధవారం చిత్రబృందం తెలిపింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘తమిళనాడులో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. నలుగురు కుర్రాళ్లు అణచివేతకు గురైన తమ గ్రామస్తుల కోసం చేసిన పోరాటం ఆసక్తికరంగా ఉంటుంది’ అని చెప్పారు. సస్పెన్స్‌, థ్రిల్‌, కామెడీ కలబోతగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉందని నిర్మాతలు అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్‌ ఎమ్‌. సినిమాటోగ్రఫీ: సాయిసాగర్‌ నేత

Updated Date - 2023-09-07T02:14:26+05:30 IST