వైద్యో నారాయణో హరి

ABN , First Publish Date - 2023-11-20T00:41:48+05:30 IST

నందమూరి చైతన్య కృష్ణ నటించిన చిత్రం ‘బ్రీత్‌’. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించారు. నందమూరి హరికృష్ణ నిర్మాత...

వైద్యో నారాయణో హరి

నందమూరి చైతన్య కృష్ణ నటించిన చిత్రం ‘బ్రీత్‌’. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించారు. నందమూరి హరికృష్ణ నిర్మాత. డిసెంబరు 2న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ‘‘వైద్య రంగం చుట్టూ నడిచే కథ ఇది. అందుకే ‘వైద్యో నారాయణో హరి’ అనే ట్యాగ్‌లైన్‌ పెట్టాం. సందేశంతో పాటు థ్రిల్‌ కలిగించే సన్నివేశాలు ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింద’’న్నారు దర్శకుడు. సంగీతం: మార్క్‌ కె.రాబిన్‌.

Updated Date - 2023-11-20T00:41:50+05:30 IST