భయంపై ఉస్తాద్‌ గెలుపు

ABN , First Publish Date - 2023-04-13T03:29:11+05:30 IST

సింహ కోడూరి హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఉస్తాద్‌’. ‘బలగం’ ఫేమ్‌ కావ్య కల్యాణ్‌రామ్‌ కథానాయిక. దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు...

భయంపై ఉస్తాద్‌ గెలుపు

సింహ కోడూరి హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఉస్తాద్‌’. ‘బలగం’ ఫేమ్‌ కావ్య కల్యాణ్‌రామ్‌ కథానాయిక. దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. బుధవారం ఈ చిత్రం టీజర్‌ను రానా దగ్గుబాటి విడుదల చేశారు. వైమానిక దళ సాహసాల నేపథ్యంలో సాగే చిత్రమిది. హీరో తన భయాన్ని వదలి పైలట్‌గా ఎలా ఎదిగాడు, పాత బైక్‌ అతని జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పింది అనేది టీజర్‌లో ఆసక్తికరంగా అనిపించింది. ఈ చిత్రానికి ఫణిదీప్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. అకీవా బి సంగీతం అందిస్తున్నారు.

Updated Date - 2023-04-13T03:29:13+05:30 IST