సెట్స్‌లోకి ఉస్తాద్‌

ABN , First Publish Date - 2023-09-08T02:13:01+05:30 IST

‘గబ్బర్‌సింగ్‌’ చిత్రంతో తడాఖా చూపిన పవన్‌ కల్యాణ్‌, దర్శకుడు హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తోంది. భారీ మాస్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది...

సెట్స్‌లోకి ఉస్తాద్‌

‘గబ్బర్‌సింగ్‌’ చిత్రంతో తడాఖా చూపిన పవన్‌ కల్యాణ్‌, దర్శకుడు హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తోంది. భారీ మాస్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది. దానికి తగ్గట్లే పవన్‌ కల్యాణ్‌ శక్తిమంతమైన పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో అభిమానులను అలరించనున్నారు. గురువారం నుంచి ఈ చిత్రం కొత్త షెడ్యూల్‌ ప్రారంభ మైంది. దీనికోసం ప్రత్యేకంగా సెట్‌ను నిర్మించారు. పవన్‌ కల్యాణ్‌ షూట్‌లో పాల్గొన్నారు. భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తో షూటింగ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్రబృందం కొత్త పోస్టర్‌ ను విడుదల చేసింది. ఇందులో పవన్‌ కల్యాణ్‌ ఖాకీ డ్రెస్‌లో స్టైలిష్‌గా కనిపించారు. ఆయనకు జోడీగా శ్రీలీల నటిస్తున్నారు. అశుతోష్‌ రానా, నవాబ్‌ షా, గౌతమి కీలకపాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.

Updated Date - 2023-09-08T02:13:01+05:30 IST