పరిణయం.. ప్రారంభం!

ABN , First Publish Date - 2023-11-25T00:51:25+05:30 IST

కె. విజయ్‌ భాస్కర్‌ స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘ఉషా పరిణయం’. లవ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ అనేది ఉపశీర్షిక. శ్రీకమల్‌ కథానాయకుడు.

పరిణయం.. ప్రారంభం!

కె. విజయ్‌ భాస్కర్‌ స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘ఉషా పరిణయం’. లవ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ అనేది ఉపశీర్షిక. శ్రీకమల్‌ కథానాయకుడు. తాన్వీ నాయిక. శుక్రవారం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. ‘‘విజయ్‌ భాస్కర్‌ అనగానే క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లే గుర్తుకొస్తాయి. వాటి సరసన నిలిచే చిత్రమిది. ఓ అందమైన ప్రేమకథని, వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్నాం. ఈ సినిమాతో తాన్వీ అనే అచ్చ తెలుగు అమ్మాయిని పరిచయం చేస్తున్నామ’’ని చిత్రబృందం తెలిపింది. వెన్నెల కిశోర్‌, శివాజీ రాజా, ఆమని, సుధ, ఆనంద్‌ చక్రపాణి తదితరులు నటిస్తున్నారు.

Updated Date - 2023-11-25T00:51:55+05:30 IST