అజ్ఞాతంలోకి ఉపేంద్ర

ABN , First Publish Date - 2023-08-15T03:01:45+05:30 IST

ప్రముఖ నటుడు ఉపేంద్రపై మరో ఎఫ్‌ఐఆర్‌ నమోదయింది. రెండురోజుల కిందట ఓ యూట్యూబ్‌ చానల్‌తో ఆయన మాట్లాడుతూ వాడుకలో లేని ఓ సామెత వాడి దళిత వర్గాలను కించపరచేలా వ్యాఖ్యలు చేశారు...

అజ్ఞాతంలోకి ఉపేంద్ర

ప్రముఖ నటుడు ఉపేంద్రపై మరో ఎఫ్‌ఐఆర్‌ నమోదయింది. రెండురోజుల కిందట ఓ యూట్యూబ్‌ చానల్‌తో ఆయన మాట్లాడుతూ వాడుకలో లేని ఓ సామెత వాడి దళిత వర్గాలను కించపరచేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దళితసంఘాలు, ప్రజాసంఘాలు ఆదివారం నిరసనకు దిగాయి. బెంగళూరు చెన్నమ్మనకెరె అచ్చుకట్టు పోలీసుస్టేషన్‌లో సాంఘిక సంక్షేమశాఖ అధికారి మధుసూదన్‌ ఫిర్యాదు మేరకు ఉపేంద్రపై అట్రాసిటీ చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఉపేంద్ర మొబైల్‌ స్విచ్‌ ఆఫ్‌లో ఉంది. ఆయన అందుబాటులో లేరు. దళితుల గురించి అనుచితంగా మాట్లాడిన ఉపేంద్రపై కఠిన చర్యలు తీసుకుంటామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మహదేవప్ప అన్నారు. బెంగళూరులో మంత్రి మీడియాతో మాట్లాడుతూ, కులాల పేరుతో హేళనగా మాట్లాడం సరికాదని అన్నారు. అట్రాసిటీ చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావడంతో అప్రమత్తమైన నటుడు ఉపేంద్ర, సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. ఓ కులాన్నిగాని, వ్యక్తిగతంగా గాని ఎవరినీ కించపరిచేలా వ్యాఖ్యానించలేదని వివరణ ఇచ్చుకున్నారు. పిటిషన్‌ను స్వీకరించిన ధర్మాసనం, అట్రాసిటీ ఎఫ్‌ఐఆర్‌కు బ్రేక్‌ వేసింది. ఇది అట్రాసిటీ చట్టం కింద నమోదు చేసే కేసు కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో ఉపేంద్రకు రిలీఫ్‌ లభించినట్లు అయింది. - ఆంధ్రజ్యోతి, బెంగళూరు

Updated Date - 2023-08-15T03:01:45+05:30 IST