జూన్‌ 9న ‘యూనివర్సిటీ’

ABN , First Publish Date - 2023-05-30T02:36:58+05:30 IST

ప్రజానటుడు ఆర్‌.నారాయణమూర్తి నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘యూనివర్సిటీ’ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకుంది. జూన్‌ 9న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నట్లు నారాయణమూర్తి చెప్పారు....

జూన్‌ 9న ‘యూనివర్సిటీ’

ప్రజానటుడు ఆర్‌.నారాయణమూర్తి నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘యూనివర్సిటీ’ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకుంది. జూన్‌ 9న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నట్లు నారాయణమూర్తి చెప్పారు. తన ప్రతి సినిమాలోనూ ఏదోక సామాజిక అంశాన్ని తీసుకోవడమే కాకుండా పరిష్కారం కూడా సూచించే నారాయణమూర్తి ‘యూనివర్సిటీ’ చిత్రంలో లీకేజీల వ్యవహారాన్ని ఎండగట్టారు. ఆయన మాట్లాడుతూ‘పదో తరగతిలో పేపర్‌ లీకేజీలు, గ్రూప్‌ వన్‌ ఉద్యోగ పరీక్షల్లోనూ పేపర్‌ లీకేజీలు... ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్‌ ఏం కావాలి? నిరుద్యోగుల జీవితాలు ఏమై పోవాలి? ఇలా విద్యా వ్యవస్థ, ఉద్యోగ వ్యవస్థ నిర్విర్యం కాకూడదు, మనది నిరుద్యోగ భారతం కాదు.. ఉద్యోగ భారతం కావాలి అని చాటి చెప్పే చిత్రం ‘యూనివర్సిటీ’’ అని చెప్పారు. ఆర్‌.నారాయణమూర్తి ప్రొపెసర్‌గా నటించిన ఈ చిత్రంలో నూతన నటీనటులకు అవకాశం కల్పించారు. ఈ చిత్రానికి గద్దర్‌, జలదంకి సుధాకర్‌, సాయిచరణ్‌, గోన్కుల రమేశ్‌, పల్లె నరిసింహం పాటలు రాశారు.

Updated Date - 2023-05-30T02:36:58+05:30 IST